
ఫార్మా కంపెనీలకు కేంద్రం అల్టిమేటం
మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ దగ్గు మందు వాడకంతో 20 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అల్టిమేటం జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుండి అన్ని కంపెనీలు అంతర్జాతీయ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో వాటిని మూసివేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా కేంద్రం అన్ని ఫార్మా కంపెనీలకు అల్టీమేటం జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.




