రాత్రంతా ఛార్జింగ్ భయాలకు చెక్.. ఆటో ఎజెక్ట్ ఛార్జర్ వచ్చేసింది!

10176చూసినవారు
రాత్రంతా ఛార్జింగ్ భయాలకు చెక్.. ఆటో ఎజెక్ట్ ఛార్జర్ వచ్చేసింది!
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పాడవుతుందనే భయంతో రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచని వారికి చైనాకు చెందిన కువాజియా సంస్థ ఒక కొత్త ఆటో ఎజెక్ట్ మొబైల్ ఛార్జర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛార్జర్ బ్యాటరీ 100 శాతం నిండగానే ఫోన్ సాకెట్ నుండి ఛార్జర్ పిన్‌ను ఆటోమేటిక్‌గా బయటకు నెట్టేస్తుంది. దీనికోసం ఛార్జర్‌లో ఒక స్ప్రింగ్, విద్యుదయస్కాంతం అమర్చారు. ఫోన్ బ్యాటరీ పూర్తికాగానే సెన్సార్ గుర్తించి, ఎలక్ట్రో మాగ్నెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయి, స్ప్రింగ్ సాయంతో ఛార్జర్ పిన్‌ను బయటకు నెట్టేస్తుంది. దీనివల్ల ఛార్జింగ్ ఆగిపోయి, ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం, పేలిపోయే ప్రమాదాలు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్