చిన్నారికి అరుదైన వ్యాధి.. సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా

0చూసినవారు
చిన్నారికి అరుదైన వ్యాధి.. సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన ఆర్యాన్ష్‌ అనే బాలుడు జన్యుపరమైన ఎస్‌ఎంఏ టైప్‌-2 అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. కండరాల కదలికలను నియంత్రించే నాడీ కణాలు దెబ్బతినడం వల్ల మంచానికే పరిమితమైన ఆర్యాన్ష్‌ చికిత్సకు రూ.1.5 కోట్ల ఇంజక్షన్‌ అవసరం. దాతల సహాయం సరిపోకపోవడంతో, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎంవో అధికారులను ఆదేశించారు. సీఎంవో అధికారులు వెంటనే బాలుని తల్లిదండ్రులను సంప్రదిస్తారని సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌ వేదికగా తెలిపారు.

సంబంధిత పోస్ట్