గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నోబుల్ నగర్‌లో మూడేళ్ల చిన్నారి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు టర్నింగ్ పాయింట్ దగ్గర నిలుచుంది. అదే సమయంలో వచ్చిన కారు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. కారు టైర్ల మధ్యలో పడిపోవడంతో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. కారును మైనర్ నడిపినట్లు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.