కుక్క కాటుకు తెగిపడ్డ చిన్నారి చెవి

40923చూసినవారు
కుక్క కాటుకు తెగిపడ్డ చిన్నారి చెవి
TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై కుక్క దాడి చేసింది. దుబ్బ తండాకు చెందిన ధరావత్ సికిందర్, యశోద దంపతుల కుమార్తె సాయికీర్తన ఆరుబయట ఆడుకుంటుంది. ఇంతలోని చిన్నారిపై వీధి కుక్క తీవ్రంగా దాడి చేసి చెవిని కొరికింది. ఈ ఘటనలో చిన్నారి చెవి సగం తెగిపడింది. తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి, అనంతరం జిల్లా కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్