
పోకిరిలో నటించని కంగనా రనౌత్.. ఇలియానాకు దక్కిన అదృష్టం!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన 'పోకిరి' సినిమాలో మొదట బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను ఎంపిక చేశారు. అయితే, 'గ్యాంగ్ స్టార్' సినిమాతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కంగనా ఈ అవకాశాన్ని తిరస్కరించింది. ఆమె స్థానంలో ఇలియానా నటించి, ప్రేక్షకులను అలరించింది. పోకిరి సినిమాను మిస్ అయినందుకు కంగనా గతంలో ఓ ఇంటర్వ్యూలో బాధపడినట్లు తెలిపింది. ఈ సినిమా మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.




