
మీర్‌పేట ఘటన.. తల్లీబిడ్డ మృతి చెందిన కేసులో బిగ్ ట్విస్ట్!
TG: హైదరాబాద్ మీర్‌పేటలో బిడ్డకు విషమించి వివాహిత సుస్మిత ఆత్మహత్య చేసుకున్న కేసుపై వివాదం నెలకొంది. ఉస్మానియా మార్చురీ వద్ద సుస్మిత భర్త యశ్వంత్, ఆమె తరఫు బంధువులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. 'సుష్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు. నా బాబుకి మా అత్తే విషమిచ్చి ఉండొచ్చు' అని యశ్వంత్ అన్నాడు. అయితే 'పోలీసులు వచ్చిన తర్వాతే సుష్మ చనిపోయిందని మాకు చెప్పారు. చనిపోయే ముందు అరగంట ఏదో జరిగింది' అని సుష్మిత బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




