TG: వికారాబాద్(D) బొంరాస్‌పేట(M) వడిచర్ల పరిధి ఊరేనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబూయి దంపతుల ఐదేళ్ల కొడుకు ముడావత్ జగన్ అరుదైన స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ (ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి రూ.16 కోట్లు విలువ చేసే జోలెజెన్‌స్మా అనే ఇంజక్షన్ అమెరికా నుంచి తెప్పించి ఇవ్వాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం బాలుడు ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేసుకుంటేనే మామూలుగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు తమ కొడుకును కాపాడాలని ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డిని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.