కోల్‌కతాలో నోట్ల కట్టల కలకలం రేపాయి. సురేంద్రనాథ్ కాలేజీలో చెదలు పట్టిన స్థితిలో రెండు సూట్‌కేసుల్లో రూ.100, రూ.500 నోట్ల కట్టలు లభించాయి. ఈ నోట్ల కట్టలు టీఎంసీ నేతలకు చెందినవని
బీజేపీ శ్రేణులు ఆరోపించారు. ఎన్నికల్లో పంచడానికి ఈ నోట్లను దాచిపెట్టారని వారు పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.