బైక్ పై వెళ్తున్న దంపతులపై దుండగుల దాడి.. భార్య మృతి

47చూసినవారు
బైక్ పై వెళ్తున్న దంపతులపై దుండగుల దాడి.. భార్య మృతి
TG: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం శివారులో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న భార్యభర్తలపై దుండగులు దాడి చేశారు. భర్త అనిల్ పై కత్తితో దాడి చేసి.. ఆయన భార్య మీనను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనిల్ కు తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్