చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన మృతదేహం

64చూసినవారు
చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన మృతదేహం
AP: విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయి ఉంది. పది రోజుల క్రితమే వ్యక్తి మృతి చెంది ఉంటాడని, మృతుడి వయస్సు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :