AP: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన రైతు పొలంలో పని చేస్తుండగా రెండు రోజుల క్రితం వజ్రం లభించింది. దీనిని సోమవారం చెన్నంపల్లికి చెందిన కొత్త వ్యాపారికి రూ.13.5 లక్షలకు విక్రయించారు. తుగ్గలి పరిసర ప్రాంతాల్లో వజ్రాలు దొరకడం సర్వసాధారణమే అయినా, ఈసారి పెండేకల్లు, డీసీకొండ ప్రాంతాల్లో వజ్రాలు లభించడం విశేషంగా మారింది.