దుర్గమ్మకు రూ.76 లక్షలతో వజ్రాలు పొదిగిన స్వర్ణకిరీటం

20చూసినవారు
దుర్గమ్మకు రూ.76 లక్షలతో వజ్రాలు పొదిగిన స్వర్ణకిరీటం
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు రూ.76 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణకిరీటాన్ని తయారు చేయించారు. దసరా ఉత్సవాల్లో ఈ కిరీటాన్ని అమ్మవారికి బహూకరించనున్నారు. కిరీటం తయారీకి తొలుత రూ.50 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించినా.. చివరకు రూ.76 లక్షలు ఖర్చయినట్లు దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్‌ రాధాకృష్ణ తెలిపారు. దేవస్థానం ఈవో, వైదిక కమిటీ సభ్యుల అంగీకారంతో నిర్దిష్ట కొలతల ప్రకారం కిరీటాన్ని తయారు చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్