తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి కేకులు కట్ చేసి, బాణసంచా కాల్చి, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యువత డిజేలతో సందడి చేయగా, కొందరు మందుబాబులు రోడ్లపై చిందులు వేశారు. వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి పోలీసులపై ఆరోపణలు చేస్తూ హల్చల్ చేశాడు. పోలీసులు ఆరోపణలను ఖండించి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.