రాజస్థాన్ అజ్మీర్‌లోని జవహార్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లో 92ఏళ్ల వృద్ధుడిపై ఓ మహిళా డాక్టర్ చేయి చేసుకుంది. అక్టోబర్ 10న ఈ ఘటన జరిగగా.. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం రెసిడెంట్ డాక్టర్ తన ఫ్రెండ్‌తో కలిసి కారిడార్‌లో నడుస్తుండగా.. వృద్ధుడు ఆమెను తాకాడు. దీంతో ఆవేశంలో అతన్ని కొట్టింది. వృద్ధుడు క్షమాపణ చెప్పినా ఆమె ఆగలేదు. అయితే ఆ వృద్ధుడు డాక్టర్ చెస్ట్‌ను తాకడంతోనే ఆమె చేయి చేసుకుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.