రూ.150 కోసం గొడవ.. 45 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి రూ.5-6 లక్షల ఖర్చు పెట్టారు

11357చూసినవారు
రూ.150 కోసం గొడవ.. 45 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి రూ.5-6 లక్షల ఖర్చు పెట్టారు
బిహార్‌లో రూ.150 అప్పు వివాదం 45 ఏళ్ల పాటు కోర్టుల్లో నడిచి చివరకు విచిత్రంగా ముగిసింది. 1981లో అప్పు తిరిగి ఇవ్వాలని అడగడంతో మొదలైన గొడవ దాడులు, ఇంటికి నిప్పుపెట్టే ఘటనగా మారింది. అనంతరం నమోదైన కేసు నాలుగు దశాబ్దాలకు పైగా సాగి, 700కుపైగా విచారణలు, వందలాది వాయిదాలు చూసింది. ఈ క్రమంలో ఇరుపక్షాలు కలిసి రూ.5-6 లక్షల వరకు న్యాయపోరాటానికి ఖర్చు చేశాయి. 2026లో తాజాగా తీర్పు వెలువడగా, 75 ఏళ్ల భికారీ సహనీని కోర్టు దోషిగా తేల్చినా.. వృద్ధాప్యం, పేదరికం, సుదీర్ఘ విచారణను పరిగణనలోకి తీసుకుని జైలు శిక్ష విధించకుండా హెచ్చరికతో విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్