మేకల మేత విషయంలో గొడవ.. మహిళ హత్య!

60చూసినవారు
మేకల మేత విషయంలో గొడవ.. మహిళ హత్య!
యూపీలోని కాన్పూర్ జిల్లాలో మేకల మేత విషయంలో జరిగిన వివాదం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. నార్వాల్ పీఎస్ ప్రాంతంలో నివసిస్తున్న రాణి దేవి(55)కి అక్టోబర్ 2న మేకలను మేపడం గురించి తన పొరుగువాడైన సత్యంతో వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలో ఆమె గాయపడింది. రాణి దేవి కుమార్తె మౌసామి ఆమెను పీఎస్ కు తీసుకెళ్లగా వారు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. చికిత్స తర్వాత వారు ఇంటికి తిరిగి వస్తుండగా సత్యం, అతని కుటుంబం మరోసారి దాడి చేయడంతో రాణి దేవి చనిపోయింది.

సంబంధిత పోస్ట్