రూ.20 కోసం గొడవ.. పోలీసుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలి (వీడియో)

58చూసినవారు
యూపీలోని ఘాజియాబాద్‌లో రూ.20 ఆటో ఛార్జీ విషయంలో జరిగిన గొడవలో రాజ్‌కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆటో డ్రైవర్ దాడి నుంచి తప్పించుకోవడానికి మహిళా పోలీసుల పింక్ బూత్ వద్దకు వెళ్లగా, భయపడిన పోలీసులు తలుపులు మూసుకున్నారు. రక్షణ కోసం బలంగా తలుపును బాదడంతో గాజు పగిలి నరాల్లోకి దిగబడటంతో తీవ్ర రక్తస్రావం అయింది. సుమారు 40 నిమిషాల పాటు సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా పోలీసులు, స్థానికులు స్పందించకపోవడంతో సరైన వైద్యం అందక మరణించాడు. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్