యుద్ధ విమానానికి త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం

58చూసినవారు
యుద్ధ విమానానికి త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం
అమెరికాలో యుద్ధ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా అమెరికాలో హాక‌ర్ హంట‌ర్ యుద్ధ విమానానికి సౌత్‌వెస్ట్ విమానం ఎదురుగా వెళ్లింది. యుద్ధ విమానం రాక‌ను గ‌మ‌నించి అక‌స్మాత్తుగా త‌మ విమానాన్ని 500 అడుగుల మేర పైల‌ట్లు కింద‌కి దించ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. దీని వ‌ల్ల ఒక్క‌సారిగా కుదుపు రావ‌డంతో విమానంలోని ఇద్ద‌రు స‌హాయ‌కుల‌కు గాయాల‌య్యాయి. సౌత్‌వెస్ట్ విమానం పైల‌ట్లు త‌క్ష‌ణ‌మే అప్ర‌మ‌త్తం కాకుంటే పెను ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉండేది.

సంబంధిత పోస్ట్