ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. వృద్ధుడిని హత్య చేసిన వియ్యంకుడు

129చూసినవారు
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. వృద్ధుడిని హత్య చేసిన వియ్యంకుడు
AP: చిత్తూరు జిల్లా నగరిలో దారుణం చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వృద్ధుడు గుణశీలన్‌ను హత్య చేసి, ఏం. కొత్తూరు చెరువులో డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి పడేశారు. ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో కలిసి వియ్యంకుడు గంగాధరం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుత్తణిలోని కూతురు సంగీత వద్ద గుణశీలన్ ఉండగా.. జూన్ 20 నుంచి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. నిందితులు హత్యను ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్