
డాక్టర్ ఆత్మహత్య కేసు.. SI గోపాల్ అరెస్ట్
మహారాష్ట్రలో ఎస్ఐ తనను అత్యాచారం చేశాడంటూ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ గోపాల్ బదానే అరెస్టయ్యారు. ఫల్టన్ పోలీస్ స్టేషన్కు వచ్చి గోపాల్ లొంగిపోయారని ఎస్పీ తుషార్ దోషి వెల్లడించారు. సతారా జిల్లా కోర్టులో హాజరుపరచగా 4 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. కాగా ఇప్పటికే మరో నిందితుడు ప్రశాంత్ బంకర్ అదుపులోకి తీసుకున్నారు.




