TG: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డీజీపీ శివధర్ రెడ్డికి గౌరవ వీడ్కోలు పలికారు. పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్‌లో శివధర్‌రెడ్డికి గౌరవ వందనం స్వీకరించారు. కాగా ప్రభుత్వం శివధర్ రెడ్డికి చీఫ్ సెక్రటరీ హోదాను కల్పించనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, నూతన డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.