రైతులకు అదనపు ఆదాయం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం త్వరలో PM-KUSUM 2.0 పథకాన్ని తీసుకురానుంది. దీని ద్వారా ఒకే భూమిలో పంటలు పండించడంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అగ్రివోల్టాయిక్స్ విధానంలో ఎత్తైన సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి, వాటి కింద సాధారణ సాగు చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సహ-సాగు విధానానికి 10 గిగావాట్ల లక్ష్యాన్ని కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎంపికైన ప్రాజెక్టులకు సాంకేతిక సాయం, VGFతో పాటు పరిశోధన మద్దతు అందించనున్నారు.