ఉత్తరప్రదేశ్లోని మథురలో పాఠశాలకు వెళ్తున్న ఓ చిన్నారిపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ భయానక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. వీధుల్లో కోతుల బెడద పెరుగుతుండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కోతుల దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.