మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపుతోంది. వైన్‌గంగా నదిని దాటి గడ్చిరోలి నుంచి వచ్చిన ఈ ఏనుగులు కరోలి, అకాపూర్, గేవర గ్రామ శివార్లలో తిరుగుతున్నాయి. దీంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటనలున్నాయి. అటవీశాఖ అధికారులు ఏనుగుల కదలికలపై నిఘా సారించారు.