భట్టి విక్రమార్క శాఖలో భారీ స్కాం జరిగింది: RS ప్రవీణ్

19చూసినవారు
AP: భట్టి విక్రమార్క శాఖలో రూ.1500 కోట్ల కుంభకోణం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాన్స్‌కో టెండర్లలో ఎస్సీలకు 15%, బీసీలకు 27%, ఎస్టీలకు 10% కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించినా, కేసీఆర్ రోస్టరీ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వడంతో పాటు ఈఎండీ రద్దు చేశారని, ఇది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 300 సబ్‌స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్