TG: కాసేపట్లో ప్రజాభవన్‌లో కీలక సమావేశం జరగనుంది. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్, మంత్రులు, MLAలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. పదేళ్లలో రాష్ట్రానికి నీటివాటాల్లో జరిగిన నష్టం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వనున్నారు. అలాగే రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు.