కేజీ ఉల్లి జస్ట్ రూ.20 పైసలు మాత్రమే!.. రైతు చట్టాలపై నెట్టింట చర్చ!

83చూసినవారు
మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉత్పత్తి అధికంగా ఉండటం, బంగ్లాదేశ్‌కు ఎగుమతులు నిలిపివేయడంతో కేజీ ఉల్లి 20 పైసలకు పడిపోయింది. ఒక కేజీ పండించడానికి రూ.10 ఖర్చవుతుందని, నష్టాలతో రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారని, అందుకే రోడ్డుపై పారేస్తున్నామంటూ వాపోతున్నారు. ఈ పరిస్థితిపై ఓ రైతు సంఘం నేత ట్వీట్ చేయగా, పలువురు నెటిజన్లు “వ్యవసాయ చట్టాలను అడ్డుకున్నందుకే ఇలాంటి పరిస్థితి. అవి అమల్లో ఉంటే రైతులు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అమ్ముకొని మంచి ధర పొందేవారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you