AP: రాజమహేంద్రవరం సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ అధికారులు దాని జాడ కోసం గాలిస్తున్నారు. తాజాగా, రాజమహేంద్రవరం శివారులోని దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారిపై పెద్దపులి కనిపించింది. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.