TG: నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ పెద్దపులుల సంరక్షణ కేంద్రంలో పర్యాటకులకు పెద్ద పులులు దర్శనమిస్తున్నాయి. అక్టోబర్ 1న పునఃప్రారంభమైన సఫారీలో, గత 20 రోజుల్లో ఐదు నుంచి ఆరుసార్లు పులులు కనిపించాయి. అమ్రాబాద్ మండలంలోని పరహాబాద్ గుండం సఫారీలో, దట్టమైన అడవి మార్గంలో పర్యటిస్తున్న పర్యాటకులకు రహదారిని దాటుతూ ఒక పెద్దపులి కనిపించింది. ఈ అరుదైన దృశ్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.