
ఉగాది పండుగ ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ఈ సారి 'ఉగాది' పండుగా ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అమావాస్య గడియలు ఉండటమే దీనికి కారణం. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందన్నారు. ఇదే రోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలని సూచిస్తున్నారు.




