ఉత్తరప్రదేశ్ కన్పూర్ నగరంలో బుధవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మిశ్రీ బజార్‌లోని మర్కజ్ వాలి మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం సుమారుగా 500 మీటర్ల దూరం వరకు వినిపించగా, జనం భయాందోళనలో పరుగులు తీశారు. సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డగా, రెండు స్కూటర్లు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్ బృందాలు చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.