ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కొత్త సంవత్సరంలో బిగ్ షాక్.. రూ. 111 పెరిగిన సిలిండర్ ధర
Jan 01, 2026, 09:01 IST/

కొత్త సంవత్సరంలో బిగ్ షాక్.. రూ. 111 పెరిగిన సిలిండర్ ధర

Jan 01, 2026, 09:01 IST
కొత్త ఏడాది తొలిరోజే వినియోగదారులకు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు బిగ్‌ షాక్‌ ఇచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ ధరను రూ.111 పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి పెరిగింది. ముంబై, కోల్‌కతా, చెన్నైలలో కూడా ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వ్యాపారాల నిర్వహణ ఖర్చులను పెంచే అవకాశం ఉంది. అయితే, గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.