
ఏపీ ఐటీ మంత్రి లోకేష్‌తో అమెరికాలో పెట్టుబడులపై చర్చ
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి లోకేష్, సెలెస్టా విసి మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌తో సమావేశమయ్యారు. విశాఖను ఐటీ, డేటా హబ్‌గా అభివృద్ధి చేయడం, ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ కోరారు. అమరావతిలో ఎంటర్టైన్మెంట్ సిటీ అభివృద్ధి, క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.




