బొడ్రాయిపై మూత్రం పోసిన వ్యక్తికి దేహశుద్ధి.. తీవ్ర ఉద్రిక్తత!(వీడియో)

14చూసినవారు
TG: హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. కట్ట మైసమ్మ గుడి వద్ద గల బొడ్రాయిని ఓ వ్యక్తి మూత్రం పోసి అపవిత్రం చేయడం కలకలం రేపింది. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసి హిందూ సంఘాలు, ప్రజలు భారీగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్