సింహం బోనులోకి వెళ్లిన వ్యక్తి.. దాడి చేసి చంపేసింది(వీడియో)

74చూసినవారు
బ్రెజిల్‌లోని పార్క్ అరూడా కామరా జూలో షాకింగ్ ఘటన జరిగింది. సింహాన్ని దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి ఫెన్సింగ్‌ను దూకి దాని బోనులోకి వెళ్లాడు. చెట్టు ద్వారా కిందకు దిగే ప్రయత్నం చేశాడు. అతడిని గమనించిన సింహం పరుగున వెళ్లి దాడి చేసి కింద పడేసింది. పొదల్లోకి లాక్కెళ్లి చంపేసింది. జూ సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే ఈ దారుణం జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్