జపాన్‌లో భారీ
భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతమైనహోక్కాయిడోలో సోమవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఈ
భూకంపం సుమారు 80 కి.మీ లోతులో నమోదైనట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.