టర్కీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం (వీడియో)

20504చూసినవారు
టర్కీ పశ్చిమ ప్రాంతాన్ని మంగళవారం ఉదయం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సుల్లో భూ ప్రకంపనలు బలంగా అనిపించాయి. భూకంప ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆస్తి లేదా ప్రాణ నష్టంపై ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్