‘మెహందీ’ పెట్టడానికి ఓ మిషన్.. ఇంకొన్ని ఉద్యోగాలు పోయినట్టేగా! (వీడియో)

21చూసినవారు
సాంకేతికతతో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్న ఆందోళన మరోసారి తెరపైకి వచ్చింది. ఓ మెషిన్‌ అమ్మాయి చేతికి చక్కగా మెహందీ వేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా ఈ వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘ఇంకొన్ని ఉద్యోగాలు పోయాయ్‌గా’’ అని వ్యాఖ్యానించారు. ఏఐ కారణంగా ఇప్పటికే పలు రంగాల్లో ఉద్యోగాలు తగ్గుతున్న నేపథ్యంలో.. ఇలాంటి మెషిన్లు మెహందీ కళాకారుల ఉపాధిపైనా ప్రభావం చూపుతాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్