అమెరికాలోని కాలిఫోర్నియాను కార్చిచ్చు వణికిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ తారల నిలయం లాస్ ఏంజెలిస్ ప్రస్తుతం రాకాసి మంటల్లో తగలబడిపోతోంది. ప్రముఖుల ఇళ్లు కాలిబూడిదయ్యాయి. బంగారం, నోట్ల కట్టలు భస్మీపటలం అయ్యాయి. జనవరి 5న జరిగిన గోల్డెన్ గ్లోబ్ వేడుకలో 'దేవుడు లేని నగరం' అంటూ సృష్టికర్తను ఎగతాళి చేయడమే దీనికి కారణమంటూ USలో విపరీతంగా షార్ట్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ కామెంట్ చేసిన 2 రోజులకే కార్చిచ్చు తన ప్రతాపం చూపిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.