మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కొందరు దుండగులు ఓ ఆవు దూడను కారులో ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న తల్లి ఆవు తన బిడ్డ కోసం తల్లడిల్లిపోయింది. తన బిడ్డను కాపాడుకునేందుకు కారును అడ్డగించి, చుట్టూ తిరుగుతూ తీవ్రంగా ప్రయత్నించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు CCTVలో రికార్డ్ కాగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దూడలను అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై చర్యల తెసుకోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.