దేశ రక్షణలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్‌లో ఐఎన్‌ఎస్ ఇక్షక్ జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి హాజరయ్యారు. కాగా ఇక్షక్ జల ప్రవేశం ద్వారా సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే సంస్థ 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది.