ముంబైలోని విరార్–చర్చ్‌గేట్ లోకల్ రైలులో ఓ ప్రయాణికుడు బహిరంగంగా మద్యం తాగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఉదయం సోమవారం 11:50 గంటలకు విరార్ నుంచి బయలుదేరిన రైలులో దివ్యాంగుల కోచ్ సమీపంలో అతడు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. తోటి ప్రయాణికుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై వసాయి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్‌పీఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు.