ఫిట్స్‌ రావడంతో నిండు గర్భిణి మృతి

29368చూసినవారు
ఫిట్స్‌ రావడంతో నిండు గర్భిణి మృతి
AP: శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం అర్జునపురంలో నిండు గర్భిణి అయిన కాయ ధనలక్ష్మి (26) మృతిచెందిన హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భోజనం చేస్తుండగా ఫిట్స్ రావడంతో కుటుంబసభ్యులు ఆమెను సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫిట్స్ కారణంగా ఊపిరితిత్తుల్లోకి ఆహారం చేరడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ధనలక్ష్మికి ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది.

సంబంధిత పోస్ట్