ఢాకా వేదికగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డేలో అరుదైన సంఘటన జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ చేసిన 50 ఓవర్లలో మొత్తం స్పిన్నర్లే ఉపయోగించగా, ఐదుగురు బౌలర్లే అన్ని ఓవర్లను పూర్తి చేశారు. బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ ఒక్క వికెట్ నష్టంతో 10 పరుగులు చేసి గెలిచింది. ఇలా వన్డే క్రికెట్ చరిత్రలో మొదటిసారి 50 ఓవర్లు పూర్తిగా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించడం విశేషం.