ఢిల్లీలో వింత వైద్యం.. 26 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం!

16చూసినవారు
ఢిల్లీలో వింత వైద్యం.. 26 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం!
ఢిల్లీలో ఒక అరుదైన వైద్య సంఘటన వెలుగులోకి వచ్చింది. సంతానలేమి సమస్యతో చికిత్సకు వెళ్లిన 26 ఏళ్ల యువకుడి పొత్తికడుపులో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిని 'పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్' (PMDS) అంటారని, ప్రపంచంలో ఇప్పటివరకు 300 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి యువకుడి శరీరంలోని స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్