టైటిల్‌తో పాటు RCB ఖాతాలో అరుదైన రికార్డ్

65చూసినవారు
టైటిల్‌తో పాటు RCB ఖాతాలో అరుదైన రికార్డ్
ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించి, వరుసగా రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో, ఓపెనర్లు విరాట్ కోహ్లి (75), వెంకటేశ్ అయ్యర్ (32) విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో CSK 2023 ఫైనల్లో గుజరాత్‌పై చేసిన 24 బంతుల్లో 50 పరుగుల రికార్డును బద్దలు కొట్టింది.

సంబంధిత పోస్ట్