ఆకాశంలో ఆదివారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. సా.5.59 గంటల నుంచి కనువిందు చేయనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్
ఇండియా తెలిపింది. తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనిపించనుంది. ఎలాంటి పరికరం లేకుండానే రాత్రి వేళ వీక్షించవచ్చు. బైనాక్యులర్, టెలిస్కోప్‌తో శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలనూ చూడవచ్చని తెలిపింది. భూమికి దాదాపు 126 కోట్ల km దూరంలో ఉండే శని 2025 Sep 21న కూడా ఇలానే దగ్గరగా వచ్చింది.