ప్రకృతిలో విచిత్రమైన జీవుల్లో షణ్ముఖ కాకి ఒకటి. దీనిని జెముడు కాకి, సాంబార్ కాకి, చమరకాకి అని కూడా పిలుస్తారు. ఈ పక్షి పాములను వేటాడటంలో నిష్ణాతులు. ఒకసారి కంటపడితే, ఎంతటి విషపూరితమైన పామునైనా సరే, దానిని చంపి తినే వరకు వదలదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో, ఈ కాకి తాచుపామును వేటాడి చంపింది. ఈ అరుదైన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఈ పక్షులు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం అరుదుగా మారిందని, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.