మంచిర్యాల అడవిలో మెరిసిన అరుదైన పట్టుచిమ్మట

92చూసినవారు
మంచిర్యాల అడవిలో మెరిసిన అరుదైన పట్టుచిమ్మట
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా తాండూరు అటవీ ప్రాంతంలో అరుదైన టస్సార్‌ సిల్క్‌ మాత్‌ (పట్టుచిమ్మట) కనువిందు చేసింది. సుమారు 15 సెం.మీ పొడవైన రెక్కలు, వాటిపై గుడ్లగూబ కళ్లను పోలిన ప్రత్యేక గుర్తులు దీని ఆకర్షణ. శత్రువులను భయపెట్టి రక్షించుకునేందుకు ఈ మచ్చలు ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉన్న సహజసిద్ధ టస్సార్‌ పట్టును ఉత్పత్తి చేసేది ఈ చిమ్మటలే. మాదారం బీట్‌ పరిధిలో వీటి ఉనికి అటవీ ప్రాంతంలోని జీవవైవిధ్యానికి నిదర్శనమని అటవీశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్